నేడు బడిబాటలో స్వచ్ఛ పాఠశాల

Update: 2019-06-17 02:06 GMT

తెలంగాణ వ్యాప్తంగా బడులు పునఃప్రారంభమైన నేపథ్యంలో సర్కార్ బడుల్లో బడిబాట నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు స్వచ్ఛ పాఠశాలలో భాగంగా తరగతి గదులు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణను శుభ్రం చేయనున్నారు. చెట్ల సంరక్షణ, చెట్లకు నీరుపోయడం, చెట్ల బాధ్యతను విద్యార్థులకు అప్పగించడం చేస్తారు. రేపు గ్రామాల్లో ఉన్న బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, అవసరమైతే బాలకార్మిక నిర్మూలనాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికాధికారులను భాగస్వాములను చేయడం, పాఠశాల యాజమాన్య కమిటీతో సమావేశం నిర్వహించడం చేస్తారు. ఎల్లుండి సర్కారు పాఠశాలల ప్రత్యేకతలపై ప్రచారం మాతృభాష, ఆంగ్ల భాషలో విద్యాబోధన తదితర అంశాలపై అవగాహన కార్యక్రం చేపడుతారు.

Tags:    

Similar News