ఈరోజు జనగామ వెళుతున్న బండి సంజయ్
* బీజేపీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మ పరామర్శించనున్న బండి * జనగామ సీఐ మల్లేష్ తీరును ఖండించిన బండి సంజయ్ * సీఐను సస్పెండ్ చేయాలని డిమాండ్
Bandi Sanjay (file Image)
ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనగామలో పర్యటించనున్నారు. జేపీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మపై జనగామ సీఐ మల్లేష్ లాఠి ఛార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ శర్మను బండి సంజయ్ పరామర్శించనున్నారు. జనగామ సీఐ మల్లేష్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని లేదంటే జనగామ డీసీపీ కార్యాలయన్ని పార్టీ శ్రేణులతో కలసి ముట్టడిస్తానని బండి సంజయ్ హెచ్చరించారు. దీంతో పోలీసులు అల్టర్ అయ్యారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు.