Tita offers to software Sharada : శారదకు 'టిటా' అద్భుత అవకాశం

Tita offers to software Sharada : లాక్ డౌన్ సమయంలో చాలా మంది తమ ఉపాధి కోల్పోయారు.

Update: 2020-08-02 05:24 GMT
శారద ఫైల్

Tita offers to software Sharada : లాక్ డౌన్ సమయంలో చాలా మంది తమ ఉపాధి కోల్పోయారు. అందులో భాగంగా వరంగల్ కి చెందిన శారద అనే ఓ అమ్మాయి హైదరాబాదులో తానూ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కోల్పోయింది. అయినప్పటికీ తానూ మాత్రం దైర్యాన్ని కోల్పోలేదు. కుటుంబ పోషణకి గాను మార్కెట్‌లో ఉండి కూరగాయల వ్యాపారం చేస్తోంది. దీనిపైన ఇప్పటికే మీడియా అనేక రకాల కథనాలని వెల్లడించింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంత మంది పలువురు రాజకీయ నాయకులు ఆమెను పలకరించారు.

కానీ ఇప్పుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ శారదకు అండగా నిలుస్తుంది. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి నిరుద్యోగురాలైన శారదకు తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టిటా) అండగా నిలిచేందుకు ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే శనివారం శారదకు టిటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ మక్తాల ఉచితంగా ల్యాప్‌టాప్‌ను అందచేశారు. కృత్రిమ మేథస్సు (ఏఐ) టెక్నాలజీపై శారదకు ఉచితంగా శిక్షణ ఇస్తామని, ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. టిటా గత కొద్ది రోజుల క్రితం యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఎట్‌ డల్లాస్‌ భాగస్వామ్యంతో చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉచిత శిక్షణ పొందేందుకు అవసరమైన పత్రాలను శారదకు అందించారు.


Tags:    

Similar News