జగిత్యాలలో పులి కలకలం

Update: 2019-10-03 06:40 GMT

జగిత్యాల జిల్లలో పెద్దపులి సంచారం దడ పుట్టిస్తోంది. మ్యాడపల్లి -బీబీ రాజపల్లి గ్రామాల మధ్య మామిడి తోటలో పులి సంచరిస్తున్నట్టు గ్రామస్తులు గుర్తించారు. దానిని వీడియో కూడా తీశారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆ వైపు వెళ్లడానికే భయపడుతున్నారు. అడవిలో పులి సంచరించింది వాస్తవమేనని గ్రామ సర్పంచ్‌ కూడా అంటున్నారు.

ఈ ఫోటో చూస్తే మామిడి తోటలో దట్టంగా ఉన్న పచ్చగడ్డిలో పులి సంచరిస్తున్నట్టు గమనించవచ్చు. తోటలో పశువులను కట్టేయడంతో వాటి కోసం వచ్చిందేమోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కోసమే ఇది ఇక్కడ సంచరిస్తున్నట్టు ఆందోళన చెందుతున్నారు.

మల్యాల మండలం కొండగుట్ట ప్రాంతంలోని మసీదు గుట్ట సమీపంలో రెండు రోజుల క్రితం మేతక వెళ్లిన గేదెల మందపై పులి దాడి చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మందపై దాడి చేసిన పులి దానిని తీవ్రంగా గాయపరిచింది. దీంతో పశువుల కాపర్లు భయపడుతున్నారు. పశువులను మేతకు తోలుకుపోవడానికి జంకుతున్నారు. అటవీ అధికారులు పట్టించుకుని పులిని బంధించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News