Mulugu: ములుగు జిల్లాలో విషాదం.. మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు దుర్మరణం
Mulugu: ములుగు జిల్లాలో విషాదం.. మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు దుర్మరణం
Mulugu: ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వెంకటాపురం మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేలినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికాలు ఇంకా ధ్రువీకరించలేదు.
ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకటాపురం పరిసర అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మందుపాతర పేలినట్లు వార్తలు వస్తున్నాయి.