IPS Officers: ముగ్గురు ఐపీఎఎస్ అధికారులకు కేంద్రం షాక్.. 24 గంటల్లో ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు

IPS Officers: కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ అధికారులను వెంటనే వారి స్థానాలకు పంపించాలని ఆదేశించింది.

Update: 2025-02-22 01:15 GMT

IPS Officers: ముగ్గురు ఐపీఎఎస్ అధికారులకు కేంద్రం షాక్.. 24 గంటల్లో ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు

IPS Officers: కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ అధికారులను వెంటనే వారి స్థానాలకు పంపించాలని ఆదేశించింది. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్తా, అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీకి కేటాయించిన ముగ్గురు అధికారులు 24 గంటల్లో ఆంధ్రాలో రిపోర్టు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర విభజన సందర్భంగా ఈ అధికారులు ఏపీకి కేటాయించబడ్డారు. వీరు ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అంజనీ కుమార్ రోడ్ సేఫ్టీ డీజీగా ఉండగా అభిలాష్ బిస్తా పోలీస్ ట్రైనింగ్ డీజీగా అభిశేక్ మహంతి ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా పని చేస్తున్నారు. అయితే అంజనీ కుమార్, అభిలాష బిస్తా, అభిషేక్ మహాంతీలను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారి చేసీంది. 

Tags:    

Similar News