ఎల్బీనగర్‌లో మట్టిదిబ్బలు కూలి ముగ్గురు మృతి
LB Nagar: ఎల్‌బీనగర్ లో సెల్లార్ తవ్వకాల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
ప్రతీకాత్మక చిత్రం
LB Nagar: ఎల్‌బీనగర్ లో సెల్లార్ తవ్వకాల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మట్టిదిబ్బలు కూలి శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు చనిపోయారు. శిథిలాల నుంచి ఒకరి మృతదేహన్ని పోలీసులు వెలికితీశారు. మిగిలిన రెండు డెడ్ బాడీల కోసం రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
మృతులు బీహార్ కు చెందిన కూలీలుగా పోలీసులు చెప్పారు. మట్టి దిబ్బల కింద దశరథ అనే కార్మికుడు చిక్కుకున్నారు. ఆయనను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.పిల్లర్ వర్క్ చేస్తున్న సమయంలో మట్టి దిబ్బలు కూలి ముగ్గురు చనిపోయారు. మట్టి దిబ్బల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానంతో రెస్క్యూ బృందాలు గాలిస్తున్నారు.