Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వస్తోంది. ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వత ఎగ్గొట్టేయకుండ..వీలైనంత వరకూ హామీలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు రావచ్చు.. ఈ పాలన బాగలేదని కొంతమందికి అనిపించవచ్చు. అదే సమయంలో ప్రయోజనాలు పొందుతున్నవారికి ఈ ప్రభుత్వ పాలన కూడా నచ్చుతుంది. అయితే సమస్య ఏంటంటే..ప్రయోజనం పొందుతున్నవారు ఆ విషయాలేమీ బయటివారికి చెప్పడం లేదు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడంలేదనే అభిప్రాయం గ్రామాల్లో కనిపిస్తోంది. అయితే అదే గ్రామాల్లో చాలా మందికి ప్రయోజనాలు పొందుతున్నారు. తాజాగా రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం రెండో విడతగా అర్హలైన రైతుల ఖాతాల్లోకి నేడు డబ్బును జమ చేస్తోంది.
ఈమధ్యే ఎకరం భూమి ఉన్న రైతులకు రూ. 6వేల చెప్పున ప్రభుత్వం జమ చేసింది. నేడు 2ఎకరాల లోపు భూమి ఉండి..సాగు చేయడానికి అనుకూలంగా ఉంటే వారి ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. ఎకరానికి రూ. 6వేల చెప్పున ఒక్కో రైతు అకౌంట్లో మొత్తం రూ. 12వేలు జమ చేస్తుంది. మొత్తం 1కోటి 50లక్ష ఎకరాలకు రైతు భరోసా నిధులు అకౌంట్లో జమ కానున్నాయి. అయితే ఒకసారి భారీగా డబ్బు ఇవ్వడం కుదరకపోవడంతో ప్రభుత్వం విడతల వారీగా ఇస్తోంది. గత బుధవారం ఎకరం భూమి ఉన్న వారికి మొత్తం 17.03లక్షల మంది రైతులకు 6వేల చొప్పున ఇచ్చింది. ఇలా మొత్తం రూ. 533కోట్లు జమ చేసింది. సోమవారం మధ్యాహ్నం 12గంటల నుంచి రైతు భరోసా డబ్బులు జమ కానున్నాయి.