తెలంగాణ కేబినెట్ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు.. రామ్మోహన్‌కి బెర్త్‌..?

Telangana: రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా రామ్మోహన్‌ రెడ్డికి పేరు

Update: 2023-12-06 13:44 GMT

తెలంగాణ కేబినెట్ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు.. రామ్మోహన్‌కి బెర్త్‌..?

Telangana: తెలంగాణ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్‌లో బెర్త్ దక్కే ఛాన్స్ ఉందంటూ పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లా డీసీసీగా ఉన్న రామ్మోహన్ రెడ్డికి కేబినెట్‌లో స్థానం దక్కుతుందనే వార్తలు వస్తున్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న రామ్మోహన్ రెడ్డి.. 2014తో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రామ్మోహన్ రెడ్డి.. నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. దీంతో పాటు రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరు ఉండటంతో కేబినెట్‌లో ఆయన బెర్త్ కన్ఫామ్ అనే టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News