Mahmood Ali: దేశంలోనే అతిపెద్ద సీసీటీవీ సర్వేలైన్స్ హైదరాబాద్‌లోనే ఉంది

Mahmood Ali: ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పకడ్బందీగా నిఘా

Update: 2023-09-25 10:26 GMT

Mahmood Ali: దేశంలోనే అతిపెద్ద సీసీటీవీ సర్వేలైన్స్ హైదరాబాద్‌లోనే ఉంది

Mahmood Ali: హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 2 వేల 500 సీసీటీవీ కెమెరాలను హోంమంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్, వార్ రూమ్, విజిటర్స్ గ్యాలరీని కూడా ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద సీసీటీవీ సర్వేలైన్స్ హైదరాబాద్‌లోనే ఉందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి రాష్ట్ర పోలీసులు ముందు వరుసలో ఉన్నారన్నారు హోంమంత్రి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పకడ్బందీగా నిఘా పెట్టామన్నారు. ఏకకాలంలోనే అన్ని సీసీటీవీలను పరిశీలించే అవకాశం ఉందన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ అంటూ కొనియాడారు.

Tags:    

Similar News