KTR: తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన కీలక భేటీ

KTR: గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

Update: 2023-12-04 14:15 GMT

KTR: తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన కీలక భేటీ  

KTR: ఎన్నికైన ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఓటమికి గల కారణాలను వి‌శ్లేషించుకుని.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 10 సంవత్సరాల కాలంలో BRS ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని.., ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినా, బీఆర్ఎస్ పార్టీకి గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారన్నారు. ఇప్పుడు ప్రజలు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

సమాజంలోని అన్ని వర్గాల నుంచి వందలాది సందేశాలు వస్తున్నాయని.. త్వరలోనే పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇకపై పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉందామని.. కేటీఆర్ సూచించారు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News