Padi Kaushik Reddy: హైకోర్టు చరిత్రలో నిలిచే తీర్పు ఇచ్చింది
padi kaushik reddy: స్పీకర్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి
padi kaushik reddy
padi kaushik reddy: హైకోర్టు చరిత్రలో నిలిచే తీర్పు ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. నాలుగు వారాల్లో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరుతున్నామని చెప్పారు. తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నాలుగు రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. పార్టీ మారినవారిపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. హైకోర్టు ఆదేశాలను స్పీకర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.