డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి ఈటల

కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఈటల భరోసానిచ్చారు. ఒక్కో పేషెంట్‌పై ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు పెడుతున్నామని ఈటల తెలిపారు.

Update: 2019-09-20 08:52 GMT

కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఈటల భరోసానిచ్చారు. అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే సునీత కిడ్నీ బాధితుల సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన మంత్రి ఈటల కిడ్నీరోగుల సమస్యలను గుర్తించే సీఎం కేసీఆర్‌ డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించారని తెలిపారు. పది వేల మందికి డయాలసిస్‌ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఒక్కో పేషెంట్‌పై ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు పెడుతున్నామని ఆయన తెలిపారు. అలాగే ఖమ్మం, కరీంనగర్‌, మంచిర్యాల లేదు రామగుండంలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపించినట్లు పేర్కొన్నారు. డయాలసిస్ వ్యాధిగ్రస్తుల ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్వేగానికిలోనై ఎమ్మెల్యే సునీత కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News