ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయిస్తుంది..?

తెలంగాణ ప్రభుత్వమే సిమిమా టికెట్లు విక్రయించే యోచనలో ఉన్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే విధానానికి స్వస్తి చెప్పబోతున్నట్లు అన్నారు.

Update: 2019-09-21 10:33 GMT

తెలంగాణ ప్రభుత్వమే సిమిమా టికెట్లు విక్రయించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ తన అభిప్రాయాన్ని ప్రకటించారు.  చిత్రం విడుదలైన తర్వాత వారం రోజుల వరకు సినిమా చూడాలంటే సాధారణ టికెట్‌ కంటే అధికంగా ఉండటం ప్రేక్షకులను సినిమాలకు దూరం చేస్తుంది. అన్ని నాణెనికి ఒక వైపు మరోవైపు సినిమా టికెట్ల కోసం క్యూలైన్ లో నిలబడి తీసుకునే పరిస్థితుల నుంచీ ఏకంగా కొన్ని సంస్థలు టికెట్లను ఆన్‎లైన్‎లో విడుదల చేస్తున్నాయి. ఆ టికెట్లను కాస్త గుత్తేదారులు ఎక్కువగా కొనుగోలు చేసి వాటిని బ్లాక్ లో అమ్ముతున్నారు. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో కోట్ల రూపాయిలు నష్టపోతుంది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వమే సిమిమా టికెట్లు విక్రయించే యోచనలో ఉన్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే విధానానికి స్వస్తి చెప్పబోతున్నట్లు అన్నారు. ఈ కొత్త విధానం వల్ల నిర్మాతలకు, పంపిణీదారులకు ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. రేస్‌కోర్స్ ట్యాక్స్‌పై స్పెషల్ డ్రైవ్ చేశామనీ, గతంలో లక్షల్లో కట్టే పన్ను ఇపుడు కోట్లల్లో కడుతున్నారనీ, ఇలాంటి వ్యవస్థను పూర్తిగా మారుస్తామని ఆయన అన్నారు. కుటుంబాలతో సంబంధం లేకుండా ప్రతిభావంతులే హీరోలవుతారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. 

Tags:    

Similar News