పల్లెల ప్రగతే అభివృద్ధికి సోపానాలని, శాఖలు సమన్వయంతో పని చేయాలి

పల్లెల ప్రగతే అభివృద్ధికి సోపానాలని, శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు.

Update: 2020-02-14 08:58 GMT

మహబూబాబాద్: పల్లెల ప్రగతే అభివృద్ధికి సోపానాలని, శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, అటవీ శాఖలతో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో ఆయా శాఖల ద్వారా నిర్వహిస్తున్న అమలు చేస్తున్న పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా జనాభా 6,54,404 ఉండగా పురుషులు 3,28,272, మహిళలు 3,26,232 ఉన్నారని, 461 గ్రామపంచాయతీలకు కలవని, 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక లో పల్లెలు సుందరవనాలుగా మారాయని, 14వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్ సి నిధులతో గ్రామలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.

జిల్లాలో 1,94,502 గృహాలకు వేప, నేరేడు, జామ, మామిడి ఇతర పండ్ల మొక్కలు పంపిణీ చేశారా లేదా అని, ఇందులో ఎంత శాతం సురక్షంగా ఉన్నాయని, ఎల్ఈడి లైట్లు జిల్లాలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని, విద్యుత్ వినియోగదారులు నుండి చెల్లించవలసిన బకాయిలు రూ 1,97,30,543 వసూలు చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ పన్నుల వసూళ్లు కేవలం 35% ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం గారి ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోనే ఉంటూ 100% పన్నులు మార్చి 31లోగా వసూలు చేయాలని ఆదేశించారు.

మేజర్ గ్రామ పంచాయతీలో మండల హెడ్క్వార్టర్ల లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించి వాటిని ఉపయోగం లోకి తీసుకురావాలని, పారిశుద్ధ్యం పనులు నిరంతరం కొనసాగాలని అన్నారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో అమలు చేయబడుతున్న పథకాలు పనులపై సమీక్షిస్తూ జల శక్తి అభియాన్ లో భాగంగా ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మాణాలు తప్పనిసరని, దీని ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చని తెలిపారు. జిల్లాను ఓడిఎఫ్ గా ప్రకటించుకొన్నామని, నిర్మించుకున్న మరుగుదొడ్లు 100% వినియోగించుకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News