TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణికులకు టికెట్ రేట్లపై డిస్కౌంట్

తెలంగాణ నుంచి బెంగుళూరుకు ప్రయాణించే వారికి టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఛార్జీల్లో ప్రత్యేక డిస్కౌంట్ ఇచ్చింది.

Update: 2025-02-17 12:19 GMT

టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణికులకు టికెట్ రేట్లపై డిస్కౌంట్ 

TGSRTC: తెలంగాణ నుంచి బెంగుళూరుకు ప్రయాణించే వారికి టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఛార్జీల్లో ప్రత్యేక డిస్కౌంట్ ఇచ్చింది. తెలంగాణ నుంచి బెంగుళూరు ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు వెల్లడించింది. అన్ని సర్వీసులకు ఈ డిస్కౌంట్ వర్తింపు ఉంటుందని ఇందుకు సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో బెంగళూరు ఒకటి. ఐటీ హబ్‌గా బెంగళూరుకు గుర్తింపు ఉంది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఆ జాబితాలో ఉద్యోగులతో పాటు వ్యాపారులు కూడా ఉన్నారు. వీరేకాకుండా అనేక మంది వేర్వేరు పనుల నిమిత్తం తరచుగా హైదరాబాద్ - బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తుంటారు. మరీ ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఈ రూట్‌లో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇలారాకపోకలు సాగించే వారిలో ఎక్కువ మంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది.

ప్రస్తుతం ఉన్న ధరలకు 10 శాతం డిస్కౌంట్ అందించనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ డిస్కౌంట్‌తో ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా అవుతుంది. ఈ క్రమంలో ఆర్టీసీ ఇచ్చిన డిస్కౌంట్‌తో వీరికి బిగ్ రిలీఫ్ కలగనుంది. ఈ డిస్కౌంట్‌తో వారి ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి.

బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక మారిన ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఏసీ స్లీపర్ (బెర్త్) ప్రస్తుతం టికెట్ ధర రూ.1569 ఉండగా డిస్కౌంట్‌తో టికెట్ ధర రూ.1412 కు తగ్గింది.

ఏసీ స్లీపర్ (సీటర్) టికెట్ ధర రూ.1203 ఉండగా డిస్కౌంట్ తర్వాత రూ.1083 కి తగ్గింది.

రాజధాని బస్సు ప్రస్తుత టికెట్ ధర రూ.1203 కాగా డిస్కౌంట్‌ తర్వాత టికెట్ ధర రూ.1083 కు తగ్గింది.

నాన్ ఏసీ స్లీపర్(బెర్త్) ప్రస్తుత టికెట్ ధర 1160 ఉండగా డిస్కౌంట్ తర్వాత టికెట్ ధర రూ.1044 కు తగ్గింది.

నాన్ ఏసీ సీటర్ ప్రస్తుత టికెట్ ధర రూ.951 కాగా డిస్కౌంట్ తర్వాత టికెట్ ధర 856 గా ఉంది.

సూపర్ లగ్జరీ ప్రస్తుత టికెట్ ధర రూ.946 కాగా డిస్కౌంట్ తర్వాత టికెట్ ధర రూ.851 గా ఉంది.

Tags:    

Similar News