Telangana: ఖమ్మం జిల్లా కోక్యతండా గ్రామంలో ఉద్రిక్తత
Telangana: ఓ వ్యక్తిపై ప్రజాప్రతినిధి కుమారుడు బాలసాని విజయ్, మరికొందరు కర్రలతో దాడి
Representational Image
Telangana: ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కోక్యతండా గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై ప్రజాప్రతినిధి కుమారుడు బాలసాని విజయ్, మరికొందరు కర్రలతో దాడికి పాల్పడ్డారు. గ్రామంలో చేపడుతున్న బీటీ రోడ్డు ఎత్తు పెరగడంతో.. పొలంలోకి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చిన్న గొడవ కాస్త దాడి చేసుకునే వరకు దారి తీసింది. దాడిలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.