Hyderabad: బీసీ సంఘాల ఆందోళన.. గాంధీభవన్‌ దగ్గర ఉద్రిక్తత..

Hyderabad: హైదరాబాద్‌ గాంధీభవన్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాంధీభవన్‌ గేట్‌ ఎదుట బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి.

Update: 2025-11-26 08:20 GMT

Hyderabad: హైదరాబాద్‌ గాంధీభవన్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాంధీభవన్‌ గేట్‌ ఎదుట బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని ధర్నా నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ ఆందోళన బాట పట్టారు.

పంచాయతీ ఎన్నికల రద్దుకు బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు.. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లోనూ బీసీ సంఘాల నేతలు నిరసన చేపట్టారు. అంబేద్కర్‌ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో.. ట్యాంక్‌బండ్‌ నుంచి హిమాయత్‌నగర్‌ లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో.. ఆందోళనకారులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు.

Tags:    

Similar News