ఆలయాల మూసివేత

ఈనెల 26వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం ప్రభావం భారత్‌లోని అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని ప్రాంతాల్లోనే పడనుంది.

Update: 2019-12-25 08:43 GMT

ఈనెల 26వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం ప్రభావం భారత్‌లోని అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని ప్రాంతాల్లోనే పడనుంది. ఈ విషయాన్ని ప్రముఖ పొజిషనల్ ఆస్ట్రానమీ సెంటర్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. గంటన్నర నుంచి రెండు గంటల వరకు ఉండే ఈ గ్రహణం కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలను దాదాపుగా 13 గంటల పాటు మూసివేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ గ్రహణం ఎక్కువగా తూర్పుతీరప్రాతం, అండమాన్ నికోబార్, దక్షిణ భారతం, లక్షద్వీప్‌లలో కనిపించనుంది.

ఈ పాక్షిక సూర్యగ్రహణం గురువారం ఉదయం 8.26 గంటలకు ప్రారంభమై 10.57గంటల వరకు ఉంటుంది. అంటే దాదాపుగా ఈ గ్రహణ ఛాయలు 2 గంటన 31 నిమిషాల పాటు ఉంటాయి. ఈ నేపథ‌్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని దేవాలయాలతో పాటు ఎంతో ప్రఖ్యాతి గాంచిన దేవాలయాను దాదాపు 13 గంటల పాటు మూసివేయనున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం

చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమత తిరుపతి దేవస్థనా ఆలయాన్ని గ్రహనం కారణంగా మంగళవారం రాత్రి 11 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల కిలోమీటర్‌ మేర భక్తులు బారులు తీరారు. ఇదిలా ఉంటే ఆలయాన్ని గురువారం మధ్యాహ్నం తెరిచి శుద్ధి చేసి 2 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని అర్చకులు తెలిపారు.

భద్రాచలం కోదండ రామాలయం

ఇక భద్రాచలం జిల్లాలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయాన్ని సూర్యగ్రహణం కారణంగా ఈ రోజు రాత్రి 10 గంటలకు మూసివేయనున్నారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు ప్రకటించారు. తిరిగి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేస్తామన్నాన్నారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తలను లోపలికి అనుమతిస్తామని తెలిపారు.

శ్రీశైలం భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి దేవాలయం

ఇక కర్నూలు జిల్లాలో వెలసిన శ్రీశైలం భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి ఆలయాన్ని కూడా గ్రహణం కారణంగా బుధవారం రాత్రి 10గంటలకు మూసివేయనున్నారని ఆలయ ఈవో కేఎస్‌ రామరావు తెలిపారు. తిరిగి గురువారం ఉదయం 11.30 గంటల తర్వాత తెరిచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేస్తామని తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30గంటల భక్తులకు దర్శనార్థం ఆలయాన్ని తెరచి ఉంచుతామని తెలిపారు. అదే రోజు సాయంత్రం 6.30గంటలకు ఉభయ దేవాలయాల్లో ఆర్జిత అభిషేకాలు, అమ్మవారికి ఆర్జిత కుంకుమార్చన నిర్వహిస్తామని తెలిపారు.

ఉభయ దేవాలయాలతో పాటు ఆలయ ప్రాంగణంలోని వెలసిన హఠకేశ్వరం, సాక్షిగణపతి, శిఖరేశ్వరం, పాలధార-పంచధార ఆలయాను కూడా మూసివేస్తామని తెలిపారు. అంతే కాకుండా అదే జిల్లాలో వెలసిన మహానంది, డోన్‌లో శ్రీవెంకటేశ్వర ఆలయం, యాగంటి క్షేత్రం, నందవరం చౌడేశ్వరి ఆలయం, ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ ద్వారాలు కూడా మూసివేయన్నారు.

వేములవాడ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలసిన మహా పుణ్యక్షత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం. ఈ ఆలయాన్ని కూడా సూర్యగ్రహణం సందర్భంగా వేములవాడ బుధవారం రాత్రి నుంచి 15 గంటలపాటు మూసివేయనున్నారు. సూర్య గ్రహణ మోక్షకాలం తరువాత 26వ తేదీ గురువారం ఉదయం 11.20 గంటలకు సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అనంతరం సూర్య గ్రహణ శుధ్ది చేసి సుప్రభాతం, నివేదన కైంకర్యాలను నిర్వహించి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం 

తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో వెలసిన సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని గ్రహణం కారణంగా బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేయనున్నారని అధికారులు తెలిపారు. మహా సంప్రోక్షణ అనంతరం 26న (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ద్వారాలు తెరుస్తామని తెలిపారు. గ్రహణం కారణంగా 26న ఉదయం జరిగే నిత్యకల్యాణం, ఆర్జిత నేవలు నిలుపుదల చేయనున్నారు.

చిలుకూరి బాలాజీ దేవాలయం 

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో వీసా దేవునిగా ప్రఖ్యాతి గాంచిన ఆలయం చిలుకూరు బాలాజీ ఆలయం. ఈ ఆలయాన్ని

సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు రంగరాజన్‌ తెలిపారు. సూర్యగ్రహణం అయిపోయిన తరువాత ఆలయాన్ని సంప్రోక్షణ చేసి, స్వామి వారికి అభిషేకాలు పూర్తి చేసిన తరువాత ఆలయాన్ని తెరుస్తారని తెలిపారు. భక్తులు స్వామి వారిని దర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల తరువాతనే రావాలని సూచించారు.

విజయవాడ 

కృష్ణా జిల్లాలో ఇంద్రకీలాద్రి పై వెలసిన దుర్గమ్మ ఆలయాన్ని గ్రహనం కారణంగా అర్చకులు మూసివేయనున్నారు.

ఈ ఆలయాన్ని బుధవారం రాత్రి 10 గంటలకు మూసి, 26 గురువారం సాయంత్రం తెరవనున్నారు. అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించి భక్తుల దర్శనార్థం ద్వారాలను తెరచి ఉంచుతామని తెలిపారు.

Tags:    

Similar News