Siddipet: సిద్ధిపేట జిల్లాలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఆలయం..

Siddipet: బూరుగుపల్లి సమీపంలోని షెర్విత విల్లాస్ లో నిర్మాణం

Update: 2023-06-05 08:30 GMT

Siddipet: సిద్ధిపేటజిల్లాలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఆలయం..

Siddipet: భారతదేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఆధ్యాత్మిక టెంపుల్ ను సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి సమీపంలోని షెర్విత విల్లాస్ లో నిర్మిస్తున్నారు. పూజ కంపెనీ నిర్మాణ బాధ్యతలను తీసుకుని సింప్లీ పోర్ట్ అనే త్రీడీ టెక్నాలజీ కంపెనీకి అప్పగించింది .ఈ త్రీడీ టెంపుల్ నిర్మాణంలో భాగంగా 3వేల8వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తుతో మొదటగా వినాయక ఆలయం నిర్మిస్తున్నారు. రోబో సాయంతో మూడు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇందులో శివుడు, పార్వతి, వినాయకుడి గుర్భగుడులు ఉంటాయి. ఇప్పటికే వినాయకుడు, శివాలయాలు పూర్తయ్యాయి. రోబోలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నారు.

Tags:    

Similar News