ఇందిరమ్మ ఇళ్లు: ఇలా చేస్తేనే డబ్బులు

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2025-02-13 06:14 GMT

Indiramma

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ శాటిలైట్ సేవలను వినియోగించుకోనున్నారు.

ఎన్నికల హామీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక 2025 జనవరిలో చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నుంచి నిర్మాణం పూర్తై లబ్దిదారులకు ఆర్ధిక సహాయం పూర్తిగా అందేవరకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సేవలను వినియోగించుకోనుంది.

ఇంటి నిర్మాణాన్ని ఏ అక్షాంశ, ఏ రేఖాంశాల మధ్య నిర్మిస్తున్నారో గుర్తిస్తారు. దీని ప్రకారం శాటిలైట్ కు లింక్ చేస్తారు. దీంతో ఇంటి నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిధులను అందిస్తోంది. ఇంటి నిర్మాణాన్ని నాలుగు దశల్లో ఆర్దిక సహాయం అందించనున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఆధారంగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తారు.

సర్వే చేసిన సమయంలో చూపిన స్వంత స్థలంలోనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి. మరోచోట ఇంటిని నిర్మిస్తే ఆ ఇంటిని రద్దు చేస్తారు.ఇంటి నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు.బేస్ మెంట్ పూర్తైన తర్వాత తొలి విడతలో లక్ష రూపాయాలు లబ్దిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమచేస్తోంది. నాలుగు విడతల్లో రూ. 5 లక్షలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందిస్తారు.

Tags:    

Similar News