కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ

Update: 2019-05-03 05:51 GMT

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దగా ఉపయోగం లేదనే కారణంతో మూడు కార్డులు ఉపసంహరించుకుంది టిఎస్‌ఆర్‌టిసి. నవ్య, వనితా, విహారీ కార్డులను ఉపసంహరిస్తూ జీవో జారీ చేసింది. ఈ మూడు కార్డులతో సంస్థకు ఎలాంటి లాభం రావడం లేదని.. ఆర్‌ఎంల కమిటీ తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,18,661 నవ్య క్యాట్‌, 30, 080 వనితా, 841 విహారీ కార్డులు ఉన్నాయి. టిఆఎస్‌ఆర్‌టిసీ తాజా నిర్ణయంతో ఈ కార్డులు అన్నీ రద్దు కానున్నాయి.

Similar News