Telangana Rising Global Summit 2025: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

Telangana Rising Global Summit 2025: డిసెంబర్ 8, 9వ తేదీల్లో నిర్వహించనున్న "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ "కు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

Update: 2025-12-03 05:21 GMT

Telangana Rising Global Summit 2025: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి పర్యటన 

Telangana Rising Global Summit 2025: డిసెంబర్ 8, 9వ తేదీల్లో నిర్వహించనున్న "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ "కు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. 4 వేల మందికి పైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఇవాళ ప్రధాని మోడీని కలిసి సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు రేవంత్. తెలంగాణ రైజింగ్ 2025 సదస్సుకు మోడీని సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా ఆహ్వానించనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిసి వారిని కూడా ఆహ్వానించనున్నారు.

ఇప్పటికే ఢిల్లీలో AICC చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణలో జరిగే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు రావాలని ఆయన్ని ఆహ్వానించారు. ఈనెల 8, 9 తేదీల్లో తెలంగాణ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఖర్గేని ఆ‍హ్వానించారు.

అదేవిధంగా అన్ని రాష్ట్రాల సీఎంలను సమ్మిట్ కు ఆహ్వానించాలని నిర్ణయించారు సీఎం రేవంత్. రాష్ట్రాల వారీగా సీఎంలను ఆహ్వానించే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ కు జమ్ముకశ్మీర్, గుజరాత్ సీఎంలను ఆహ్వానించే బాధ్యతను అప్పగించారు. మంత్రి దామోదరకు పంజాబ్, హర్యానా, మంత్రి కోమటిరెడ్డికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సీఎంలను శ్రీధర్ బాబు ఆహ్వానించనుండగా.. మంత్రి పొంగులేటికి యూపీ, రాజస్థాన్ సీఎంను మంత్రి పొన్నం ఆహ్వానించనున్నారు మంత్రి కొండా సురేఖకు చత్తీస్ గఢ్ , మంత్రి సీతక్కకు పశ్చిమబెంగాల్ , మంత్రి తుమ్మలకి మధ్యప్రదేశ్ , మంత్రి జూపల్లికి అస్సాం, బిహార్ కు మంత్రి వివేక్ , హిమాచల్ ప్రదేశ్ కు మంత్రి అడ్లూరి, మహారాష్ట్రకు మంత్రి అజారుద్దీన్, ఒడిశా సీఎంలను మంత్రి వాకిటి ఆహ్వానించనున్నారు.

Tags:    

Similar News