Weather Update: తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
Heavy Rain Alert For Telangana: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Weather Update: తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
Heavy Rain Alert For Telangana: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి, ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల మీదుగా సాగే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే, వాయవ్య అరేబియన్ సముద్ర తీరప్రాంతం నుంచి ద్రోణి ఏర్పడి, దక్షిణ గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఈ అల్పపీడన ప్రాంతం వరకు 1.5 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో వాయుపరిమండల సగటు మట్టం వరకు విస్తరించి ఉంది.
ఈ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ప్రత్యేకంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని, మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించినట్లు తెలిపింది.