వలస కూలీల కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించిన తెలంగాణ పోలీసులు

ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వలస కూలీలు లాక్ డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు.

Update: 2020-05-05 09:40 GMT

ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వలస కూలీలు లాక్ డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు. కాగా వారందరినీ తమ తమ రాష్ట్రాలకు తిరిగి పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషితో పోలీసులు ఓ ప్రత్యేక యాప్ ను రూపొందించారు. దీంతో తమ రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వలస కార్మికులు తమ వివరాలను పోలీస్ స్టేషన్లకు వచ్చి అందులో ఎంటర్ చేస్తున్నారు. కాగా వీరందరికీ పోలీసులు నంబర్లను కేటాయించి 1200 మందిని ఒక బ్యాచ్ గా విడదీస్తున్నారు.

ఎవరూ కూడా నేరుగా రైల్వే స్టేషన్స్ కు బస్టాండ్ లకు వెళ్లొద్దు అంటున్నారు. వారి ప్రయాణం తేదీని, వారు ఎప్పుడు రావాల్సి ఉంటుందో పూర్తి వివరాలను చెబుతానంటున్న పోలీసులు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి సైబరాబాద్ పరిధి పోలీస్ స్టేషన్లలో కూలీల తమ వివరాలను ఆ యాప్ లో నమోదు చేస్తున్నారు. 

Tags:    

Similar News