తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-10-03 12:27 GMT

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో ఉందన్న సర్వే తానను తీవ్రంగా బాధించిందన్నారు. ఈ రోజుల్లో డబ్బు, అధికారం ఉన్నవారితోనే పోలీసులు స్నేహంగా ఉంటున్నారని సొంత పోలీసు శాఖపై విమర్శలు గుప్పించారు. జైళ్లలో పెద్ద సంఖ్యలో పేదలే జైళ్లలో వున్నారని, కొందరు ఏ కేసులో జైలుకు వచ్చింది కూడా తెలియదన్నారు. దేశంలో పోలీస్ అకాడమీలు డంపింగ్ యార్డులుగా మారాయని విమర్శించిన వీకే సింగ్. ఈ వ్యవస్థను మార్చలేకపోయినా పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ నైనా మారుస్తానని చెప్పారు. 

Tags:    

Similar News