నా కొడుకు, కూతురు ఇలా వాళ్లపని వాళ్లు చేసుకుంటున్నారు : కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ తనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలని తన ట్విటర్ ఫాలో వర్లతో పంచుకుంటారు.

Update: 2020-03-28 08:34 GMT
KTR With his Childrens

తెలంగాణ మంత్రి కేటీఆర్ తనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలని తన ట్విటర్ ఫాలో వర్లతో పంచుకుంటారు. అంతే కాదు రాష్ట్ర ప్రజలు తమకు ఏదైనా సమస్య ఉందని ఆయన ట్విటర్ అకౌంట్ ద్వారా ఆయన దృష్టికి తీసుకువస్తే చాలు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వారి మెసేజ్ పై స్పందించి రిప్లై ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో ఎంతో మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

వారిలో చాలా మంది ట్విటర్ ద్వారా తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువస్తున్నారు. దీంతో కేటీఆర్ తన బిజీ షెడ్యూల్‌లోనూ రిప్లై ఇస్తూ ప్రతి ఒక్కరికీ తన కార్యాలయం ద్వారా సాయం పొందాలని సూచిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తనకు, తన పిల్లలకు సంబంధించిన మరో మరుపురాని విషయాన్ని తన ఫాలోవర్లతో షేర్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసారు. ఇంతకీ అది ఏంటి అనుకుంటున్నారా. ఇప్పుడు తెలసుకుందాం..

కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనాను నివారించేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో అన్ని మూత పడ్డాయి. పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. దీంతో చాలా మంది పిల్లలు పరీక్షలు పూర్తి కాకుండానే సమ్మర్ హాలిడేస్ వచ్చాయని సంతోషిస్తూ ఆడుకుంటుంటే, కొంతమంది మాత్రం అమ్మో స్కూల్లు మొదలయితే పరీక్షలు పెడతారని చదువుకుంటున్నారు. మరికొంత మంది తమకు నచ్చిన కార్టూన్ చానెల్లను చూస్తూ కాలం గడుపుతారు. పైగా తల్లిదండ్రుల మాట అస్సలు వినరు.

కానీ మంత్రి కేటీఆర్ పిల్లలు హిమన్షు, అలేఖ్య మాత్రం ఇంట్లో ఉండి శ్రద్దగా, బుద్ధిగా చదువుకుంటున్నారు. ఇంట్లోనే ఉంటూ ల్యాప్‌ట్యాప్‌లో రాబోయే తరగతులకు సంబంధించిన ఆన్ లైన్ పాఠాలను నేర్చుకుంటూ, కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. వారిని చూసి ముచ్చటపడిన మంత్రి కేటీఆర్ కుమారుడు హిమన్షు, కుమార్తె అలేఖ్యకు చదువుకుంటున్న రెండు చిత్రాలను ఆయన ఫోన్ లో బంధించారు. ఆ తరువాత ఆయన ట్వీటర్ అకౌంట్ లో ''ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ స్కూలింగ్‌లో ఉన్నారు. నా కొడుకు, కూతురు ఇలా వాళ్లపని వాళ్లు చేసుకుంటున్నారు.'' అని ట్వీట్ చేశారు. ఆ ఫోటోలతో పాటు ఆయన ప్రేమతో పిల్లలకు ముద్దు పెడుతున్న ఇమోజీని కూడా జత చేశారు.


 

Tags:    

Similar News