చేనేత, జౌళి రంగాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి : మంత్రి కేటిఆర్
చేనేత, జౌళి రంగాలను (హ్యాండ్లూమ్, టెక్స్టైల్ మరియు అప్పారెల్) కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలని కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి స్మృతి ఇరానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
చేనేత, జౌళి రంగాలను (హ్యాండ్లూమ్, టెక్స్టైల్ మరియు అప్పారెల్) కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలని కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి స్మృతి ఇరానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ప్రస్తుత లాక్ డౌన్ వలన పెద్ద ఎత్తున చేనేత ఉత్పత్తులు చేనేత కళాకారుల వద్దని ఉన్నాయని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుందని, దేశంలో లక్షలాది మంది ఈ రంగాలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు, ఈ రంగాలను కొంత ప్రభావితం చేస్తున్నాయన్న మంత్రి కేటీఆర్. భారతదేశంలోకి మరిన్ని పెట్టుబడులు ఈ రంగాల్లో వచ్చే అవకాశం ఉన్నాయని అన్నారు. ఇందుకోసం అవసరమైన పాలసీ మార్పులతోపాటు, సంస్కరణలు చేపట్టాలని సూచించిన కేటీఆర్..తక్షణం ఆరు నెలలపాటు ఈ రంగాల్లో పనిచేస్తున్న వారికి 50 శాతం కూలి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కోరారు.
మూడు నెలల పీఎఫ్, ఈఎస్ఐ వంటి వాటిని కేంద్రమే భరించాఅన్నారు. ఈ రంగంలోని పరిశ్రమలకు మరిన్ని బ్యాంకు లోన్లు అందించాలి, రుణాల పైన వడ్డీల వసూలుకు కనీసం ఒక ఏడాది పాటు మారటోరియం విధించాలని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో సుసంపన్నమైన చేనేత కళ ఉన్నదని చేర్చబడిందినేత రంగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన మంత్రి కేటీఆర్ చేనేత రంగంలో 50 శాతం యార్న్ సబ్సిడీ ఇవ్వాలి కోరారు.