ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాలపై ఇద్దరు ఉద్యోగులపై వేటు

Update: 2019-04-28 15:35 GMT

తెలంగాణ ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాలలో జరిగిన అవకతవకలపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు ఉద్యోగులపై వేటు వేసింది. మంచిర్యాలకు చెందిన నవ్య అనే విద్యార్థినికి తెలుగులో 99 మార్కులకు బదులుగా 00 గా బబ్లింగ్ అవడానికి కారణం అయిన ఇద్దరిపై చర్యలు తీసుకుంది. ఎగ్జామినర్‌ ఉమాదేవికి అయిదువేలు జరిమానాతో పాటు ఉద్యోగం నుంచి తొలగించారు, అలాగే లెక్చరర్‌ విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 

Similar News