హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఫామ్‌హౌస్‌పై వివరణ ఇవ్వాలని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) మంత్రి కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా జన్వాడ ఫామ్‌హౌస్‌పై వివరణ ఇవ్వాలని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) మంత్రి కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులను మంత్రి కేటీఆర్ హైకోర్టులో సవాలు చేశారు. ఇక ఈ ఫాంహౌజ్ వ్యవహారం ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పిటిషన్‌పై విచారణ చేపట్టి ఎన్టీటీ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది.
ఇక పోతే మంత్రి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్‌ను పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి నిర్మించారని ఆరోపిస్తూ జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్‌ను మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్జీటీ దీనిపై విచారణ చేపట్టి మంత్రి కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో పిటిషన్ దారు దాఖలు చేసిన వ్యాజ్యంలోని ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తెలిపింది. ఈ నోటీసులను అందుకున్న మంత్రి కేటీఆర్ దీనిని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి వేసిన పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం ఆ ఉత్తర్వులపై స్టే విధించింది.