Telangana: తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
Telangana: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది.
Telangana: తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
Telangana: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 (రిజర్వేషన్లకు సంబంధించి)పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెనుకబడిన కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారించింది.
వెనుకబడిన కుల సంఘాలు తమ పిటిషన్‌లో, అత్యంత వెనుకబడిన కులాలకు (Most Backward Classes) ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలని కోరాయి. బీసీలలోని A, B, C, D వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైనందున, ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే ఎందుకు సవాల్ చేస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో, జీవో 46పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. దీంతో, షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.