BC Reservation Bill: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ హైకోర్టులో విచారణ
బిసి రిజర్వేషన్ బిల్లు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ బిల్లుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ హైకోర్టులో విచారణ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనున్నది. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన సమాజిక కార్యకర్త మాధవరెడ్డి , సిద్దిపేట జిల్లా చిన్నకొండూరకుకు చెందిన జలపల్లి మల్లవ్వ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయడంతోపాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పిటిషనర్లు కోరారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోనూ రిజర్వేషన్లు 50 శాతానికి మిచి ఇవ్వకుండా పరిమితి విధించారని.. అదే విధాంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.