TG High Court: 2019 గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
TG High Court: 2019 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. 2019 గ్రూప్-2 మెరిట్ లిస్ట్‌ను ఇటీవల తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది.
TG High Court: 2019 గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
TG High Court: 2019 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. 2019 గ్రూప్-2 మెరిట్ లిస్ట్‌ను ఇటీవల తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ ఇటీవలే పిటిషనర్లు మళ్లీ డివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లారు.
ఈ మేరకు ఇవాళ మరోసారి వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మానసం సంచలన ఆదేశాలు జారీ చేసింది. మెరిట్ లిస్ట్ చెల్లదని చెప్పిన సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా కేసులో తదుపరి విచారణను మరో ఆరు వారాలకు వాయిదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తులు ప్రకటించింది.