పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Telangana High Court: తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల విషయంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Update: 2025-06-25 05:24 GMT

Telangana High Court: తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల విషయంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై సోమవారం వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసిన విషయం తెలిసిందే.

బుధవారం జస్టిస్ టి. మాధవిదేవి నేతృత్వంలోని బెంచ్ — మూడు నెలల కాలవ్యవధిలోగా, అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News