Telangana: తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక

Telangana: 2018-19 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ రంగం సంస్థలపై కాగ్ రూపొందించిన నివేదికను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశ పెట్టింది.

Update: 2021-03-26 08:42 GMT

Telangana: తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక

Telangana: 2018-19 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ రంగం సంస్థలపై కాగ్ రూపొందించిన నివేదికను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశ పెట్టింది. రాష్ట్ర స్థితిగతులను ఈ నివేదికలో కాగ్ స్పష్టంగా వివరించింది. సామాజిక, ఆర్థిక రంగాలు, రెవెన్యూ, ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ నివేదిక ఇచ్చింది. విద్యుత్ రంగంలో డిస్కంల భారీ నష్టాలు పీయూసీల నష్టానికి కారణం అయిందని పేర్కొంది. అలాగే విద్యుత్ రంగంలో పీయూసీల నష్టం 28వేల 426 కోట్లుగా తెలిపింది.

కాళేశ్వరం ప్రాజెక్టు సంస్థ తక్షణ అవసరాల నిధుల నిర్ధిష్ట అంచనా లేకుండా అధిక వడ్డీ రుణం 539 కోట్లు వాడుకున్నదని దానికి 8.51 కోట్ల వడ్డీ వ్యయం అయిందని కాగ్‌ నివేదికలో పేర్కొంది. ఉదయ్ పథకంతో 7వేల 723 కోట్లు వచ్చాయన్నది. దేవాదాయ భూముల్లో 23 శాతం ఇతరుల ఆక్రమణలో ఉన్నాయి. జలమండలి సరఫరా చేయాల్సిన నీటిని సరఫరా చేయలేకపోయిందని కాగ్ తెలిపింది. 150 IPCD చేయాలి కానీ, 66 నుంచి 71 IPCD లు మాత్రమే చేస్తుందని కాగ్ వెల్లడిచింది. హైదరాబాద్ వాటర్ బోర్డ్ 12వందల తొమ్మిది కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని పేర్కొంది.

విద్య రంగంపై ప్రభుత్వం తక్కువ కేటాయింపులు చేసిందని కాగ్ నివేదికలో వెల్లడిచింది. 2014- 19 మధ్య క్యాపిటల్ ప్రాజెక్టుల కోసం లక్ష 18వేల 77కోట్లు ఖర్చు చేసింది. 26 ప్రాజెక్టులకు గానూ 20 ప్రాజెక్టులు 11 నెలల ఆలస్యం అయ్యాయని కాగ్ తెలిపింది. దీంతో వ్యయం లక్ష 87 వేలకు పైగా అంచనా పెరిగిందన్నారు. బడ్జెట్‌ నియంత్రణలో ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడలేదని కాగ్ వెల్లడించింది. కేటాయింపులు మించి 2014-15లతో పోల్చితే 2017 -18 వరకు 55వేల 517 కోట్లు అధిక ఖర్చు చేసింది. ఐదేళ్లలో రెవెన్యూ రాబడితో పోలిస్తే 12.41 శాతంగా ఉన్న వడ్డీ చెల్లింపులు 14వ ఆర్థికసంఘం సూచించిన దానికంటే 8.3 శాతం ఎక్కువ పెట్టింది. 2019 మార్చి నాటికి అప్పుల్లో 46 శాతం వచ్చే ఏడేళ్లలో 76 వేల 261 కోట్లు తీర్చాలని కాగ్ నివేదికలో వెల్లడించింది.

ఖనిజ అభివృద్ధి సంస్థ, గిడ్డంగులు, సాంకేతిక అభివృద్ధి సంస్థ అటవీ అభివృద్ధి సంస్థలు లాభాల్లో ఉన్నాయని కాగ్ వెల్లడించింది. 2018-2019 మధ్య ఆర్టీసీకి 928 కోట్ల నష్టాలు వచ్చాయి. TSIIC జాగ్రత్తలు లేకుండా మార్కెట్ల రేట్ల ప్రకారం తక్కువ ధరకు భూమిని విక్రయించి నష్టం చవిచూసింది. విదేశీ చదువులకు అనర్హులైన 300 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలతో నష్టం వచ్చింది. కేంద్రం ఈ- ఆస్పత్రుల కోసం ఇచ్చిన 10 కోట్ల నిధులు వాడుకోలేదని స్పష్టం చేసింది. మిషన్ భగీరథలో వృథా ఖర్చు నివారించాలని కాగ్ హెచ్చరిక చేసింది. 2016 వరకు పైలైట్ అమలులో ఉన్న నిధులు వాడుకోలేదని కాగ్ నివేదిక ఇచ్చింది. 

Tags:    

Similar News