Telangana News: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్
Telangana News: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
Telangana News: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్
Telangana News: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వైద్య బిల్లుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రూ.180.38 కోట్లు విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
ఈ నిర్ణయంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించనుంది. వైద్య ఖర్చుల కోసం వారు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం కొంత మేర తగ్గనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ, పెన్షనర్ల వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.