KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర పోలీస్‌ శాఖ భద్రత కుదింపు

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర పోలీస్‌ శాఖ భద్రత కుదించింది. గెలిచిన మాజీ మంత్రులకు..ఎమ్మెల్యేలకు కేటాయించే భద్రతను అధికారులు కేటాయించారు.

Update: 2023-12-15 07:45 GMT

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర పోలీస్‌ శాఖ భద్రత కుదింపు

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర పోలీస్‌ శాఖ భద్రత కుదించింది. గెలిచిన మాజీ మంత్రులకు..ఎమ్మెల్యేలకు కేటాయించే భద్రతను అధికారులు కేటాయించారు. మాజీ సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం వై క్యాటగిరి భద్రతను కేటాయించారు. టీపీఆర్‌కు అనుగుణంగా ఇంటెలిజెన్స్‌ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలకు 2+2 భద్రతను కొనసాగించనున్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలందరికీ పోలీస్‌ శాఖ పూర్తిగా భద్రతను తొలగించింది. ప్రజా ప్రతినిధుల భద్రతపై ఇంటెలిజెన్స్‌ శాఖ సమీక్ష నిర్వహించింది. మాజీ ప్రజాప్రతినిధులకు ఎలాంటి ప్రాణహాని లేదని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. దీంతో ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ నుంచి పోలీస్‌ శాఖ గన్‌మెన్లను రీకాల్‌ చేసింది.

Tags:    

Similar News