Telangana: DME డాక్టర్ల ఛలో హైదరాబాద్ ధర్నాపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana: జీవో విడుదలపై DME ప్రభుత్వ టీచింగ్ డాక్టర్ల హర్షం

Update: 2023-09-24 04:30 GMT

Telangana: DME డాక్టర్ల ఛలో హైదరాబాద్ ధర్నాపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం 

Telangana: DME డాక్టర్ల ఛలో హైదరాబాద్ ధర్నాపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. DME డాక్టర్ల దీర్ఘకాలిక సమస్యలు పరిగణలోకి తీసుకుని జీవోను వైద్యారోగ్య శాఖ జీవో విడుదల చేసింది. పెండింగ్ పీఆర్సీ, ఏరియర్స్, జనరల్ బదిలీలు, పలు అంశాలపై జీవో విడుదలైంది. జీవో విడుదలపై DME ప్రభుత్వ టీచింగ్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లు, అసిస్టిటెంట్‌ ప్రొఫెసర్లు కొద్ది రోజుల క్రితం ధర్నాకు పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితం కోఠిలోని DME కార్యాలయంలో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News