తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటివద్దకే వైద్య సిబ్బంది..

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Update: 2020-05-15 05:43 GMT
CM KCR(File photo)

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య పెద్దగా లేకున్నప్పటికి టెలిగా తీసుకోవడం లేదు. అందుకే కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారూ.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా వంటి లక్షణాలు ఉన్న వారికి తప్పనిసరిగా పరీక్షలు చేయాలని మంత్రి సూచించారు. ఒక్కొ ఏఎన్ఎంకు వంద ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలందరికీ మూడు, నాలుగు రోజుల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇక వైద్య సిబ్బందే ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తాజాగా జిల్లా వైద్య అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. 

Tags:    

Similar News