Telangana Aarogyasri: ఆరోగ్యశ్రీపై సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్
Telangana Aarogyasri: తెలంగాణలో ఆరోగ్యశ్రీపై రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఆరోగ్య శ్రీ చికిత్స ధరలను సర్కార్ సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ తాజాగా ప్రభుత్వం జీవోను జారీ 30 ని జారీ చేసింది.
TG Aarogyasri: ఆరోగ్యశ్రీపై సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్
Telangana Aarogyasri: తెలంగాణలో ఆరోగ్య శ్రీ చికిత్సలకు సంబంధించి రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఆరోగ్య శ్రీ చికిత్సల ధరలను సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ తాజాగా ప్రభుత్వం జీవోను జారీ 30 ని జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆ జీవోలో పేర్కొంది. అయితే ఆరోగ్యశ్రీలో ఈమధ్యే కొత్తగా 163 చికిత్సలను చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సగటున 20శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చెప్పారు. ఆరోగ్యశ్రీలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 438కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి తెలిపారు. ఫలితంగా పేదలకు నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి అదనపు ఖర్చు రూ. 600కోట్లు పెరిగిన విషయాన్ని మంత్రి వివరించారు. ఈ ఆరోగ్యశ్రీ శ్రీ ట్రస్టు దాదాపు 6లక్షల మందికి బాసటగా నిలిచిందన్నారు. కొత్త ప్రొసీజర్స్ తో మరో లక్షన్నర కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోబోతున్నట్లు మంత్రి తెలిపారు. 79లక్షల కుటుంబాలను ఆరోగ్య పరంగా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి వివరించారు.