TS Govt: అంగన్‌వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
TS Govt: త్వరలో ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో.. అంగన్‌వాడీలను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
TS Govt: అంగన్‌వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
TS Govt: అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో అంగన్‌వాడీలను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తమ జీతాలు పెంచాలనే డిమాండ్‌తో కొన్నిరోజులుగా అంగన్‌వాడీ టీచర్లు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వంలోని మంత్రులు అంగన్వాడీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ప్రభుత్వ హామీతో సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఈ లోపే రాష్ట్రప్రభుత్వం వారిపై వరాల జల్లు కురిపించింది. మరో వైపు మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది.