మిడ్‌ మానేరుపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలి : పొన్నం ప్రభాకర్‌

టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ మరోసారి తెలంగాణ మంత్రి కేటీఆర్ పై మరోసారి విమర్శల వర్షం కురిపించారు.

Update: 2020-06-01 13:39 GMT
Telangana Congress Leader Ponnam Prabhakar

టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ మరోసారి తెలంగాణ మంత్రి కేటీఆర్ పై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండపోచమ్మ, రంగనాయక సాగర్‌ ప్రాజెక్టులకు మిడ్‌ మానేరు నుంచి నీరు ఎలా తరిలిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ను పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. అప్పర్‌ మానేరు ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుల కన్నా ముందే ప్రతిపాదించబడిందని దానికి ఎందుకు నీటిని తరలించడం లేదన్నారు అడిగారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉన్నప్పుడు మీరు అప్పర్ మానేరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ఎద్దేవాచేసారని, మరి తెలంగాణ రాష్ట్రం సాధించి ఇప్పటి వరకు 6 ఏళ్లు గడుస్తున్నా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోతే ఎవరిది బాధ్యత అని ధ్వజమెత్తారు. అప్పర్ మానేరు ప్రాజెక్టు పర్యటనకు వచ్చి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కష్టకాలంలో పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News