Revanth Reddy: ఇవాళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు.
Revanth Reddy: ఇవాళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. హుస్నాబాద్ లో నిర్వహించనున్న ప్రజాపాలన వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ..ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించనున్నారు.
అక్కన్నపేట రోడ్డులో ఏర్పాటు చేసిన సీఎం బహిరంగ సభ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకులతో కలిసి పరిశీలించారు. సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే నేపధ్యంలో భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని, పార్కింగ్ ప్రత్యేక ఏర్పాట్లు , సమీప రహదారుల అభివృద్ధి, తాగు నీరు, వంచటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.