మే 27న సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన (బుధవారం) మే 27న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది

Update: 2020-05-25 16:33 GMT
KCR (File Photo)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన (బుధవారం) మే 27న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశం ప్రగతి భవన్ లో బుధవారం మధ్యాహ్నం 2గంటలకు భేటీ కానున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ, వర్షాకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలపై చేర్చించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, లొక్డౌన్ అమలు, భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యలపై సమీక్షించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు.

ప్రస్తుతం హైద్రాబాద్ లో సరి బేసి విధానం ప్రకారం సగం షాపులు ఓకే రోజు, సగం షాపులు మరుసటి రోజు తెరుస్తున్నారు. ఇదే విధంగా మరి కొంత కాలం కొనసాగించాలా లేక ఏమైన మార్పులు చేయాలా అనే విషయం పై చర్చించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. మరో వైపు రోహిణి కార్తె ప్రవేశించిన నేపథ్యంలో వర్షాకాలం వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై, గ్రామాల్లో ఎరువుల లభ్యత ఉందా లేదా, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవా అనే విషయాలపై సమీక్ష జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా జరపాలనే విషయంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 

Tags:    

Similar News