లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాతే షూటింగ్ లపైన తుది నిర్ణయం: తలసాని

Update: 2020-05-05 14:49 GMT
Talasani Srinivas Yadav (File Photo)

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపైన పడింది. అందులో సినిమా ఇండస్ట్రీ ఒకటి..లాక్ డౌన్ వలన సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. ధియేటర్లు మూతపడ్డాయి. మొత్తంగా టాలీవుడ్ బాగానే నష్టపోయింది. అయితే మళ్ళీ షూటింగ్ లు మొదలవుతాయి అన్నది అందరిలో మొదలవుతున్నాయి. ఇక వీలైనంత తొందరగా మళ్లీ షూటింగ్‌లు ప్రారంభించి మళ్ళీ ఇండస్ట్రీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఇండస్ట్రీలోని పెద్దలు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే సినీ నిర్మాతలు కొందరు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఫిల్మ్ ఛాంబర్‌లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. షూటింగ్ లు ప్రారంభించడానికి కచ్చితంగా సమయం చెప్పలేమని, మంచి చేయాలనీ ఇప్పుడు అనుకోని ముందుకు వెళ్తే చెడు జరిగితే ముందు నుంచి చేసిన పనికి చెడ్డపేరు వస్తుందని మంత్రి వెల్లడించారు. కాబట్టి లాక్ డౌన్ అయిపోయాక తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఈ సమావేశంలో సినీ నిర్మాతలు సి.కళ్యాణ్, దిల్ రాజు, తుమ్మల ప్రసన్న కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. 


Tags:    

Similar News