BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్‌రావు
BJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్‌రావు శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్‌రావు
BJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్‌రావు శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయనను ఘనంగా సత్కరించారు. కాషాయ నేతలు రామచందర్‌రావును గజమాలతో ఆహ్వానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. బాధ్యతల స్వీకరణకు ముందు రామచందర్‌రావు తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి, ఉస్మానియా విశ్వవిద్యాలయం సరస్వతీ దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.