అర్ధరాత్రి ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోన్న బీజేపీ
BJP Operation Akarsh: అర్ధరాత్రి ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోన్న బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ జూలు విదులుస్తోంది. భారీ వలసలకు స్కెచ్ వేసిన బీజేపీ కాంగ్రెస్ అసంతృప్తి నేతలకు గాలం వేస్తోంది.
Telangana BJP (File Image)
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ జూలు విదులుస్తోంది. భారీ వలసలకు స్కెచ్ వేసిన బీజేపీ కాంగ్రెస్ అసంతృప్తి నేతలకు గాలం వేస్తోంది. రాత్రి పది గంటల తర్వాత బీజేపీ నేతలు కాంగ్రెస్ అసంతృప్త నేతల ఇళ్లకు వెళ్లి బీజేపీలో చేరాలంటూ మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఇళ్లకు వెళ్లిమరీ వారితో సంప్రదించినట్లు సమాచారం. టీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్నస్వామి గౌడ్, దేవీప్రసాద్ ఇళ్లకు కూడా బీజేపీ నేతలు వెళ్లినట్లు తెలుస్తోంది.