Telangana High Court: బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా

Telangana High Court: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చేపట్టిన విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి (రేపటికి) వాయిదా వేసింది.

Update: 2025-10-08 11:29 GMT

Telangana High Court: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చేపట్టిన విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి (రేపటికి) వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు ఈ కేసు విచారణను కొనసాగించనుంది.

నేడు జరిగిన విచారణలో, పిటిషనర్ల తరఫు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఆ పరిమితి 50 శాతానికి మించకూడదు అని ఆయన స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగాల్లో 50 శాతం పరిమితి దాటినా, రాజకీయ రిజర్వేషన్లను మాత్రం పెంచరాదని పిటిషనర్ల న్యాయవాది కోర్టుకు తెలిపారు.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎన్నికల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైందని, ఈ దశలో రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం న్యాయసమ్మతం కాదని ఆయన కోర్టుకు విన్నవించారు. అధిక రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News