Talasani: ఏ నాయకుడు చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ తెలంగాణలో చేస్తున్నారన్న మంత్రి తలసాని

Talasani: ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో రెండు కోట్ల చేప పిల్లల పంపిణీ

Update: 2023-08-26 10:07 GMT

Talasani: ఏ నాయకుడు చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ తెలంగాణలో చేస్తున్నారన్న మంత్రి తలసాని

Talasani: 70 ఏళ్లుగా దేశంలోనే ఏ నాయకుడు చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ తెంగాణలో రాష్ట్రంలో చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ చేపట్టారు. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో రెండు కోట్ల చేప పిల్లలను వేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్నీ కుల వృత్తుల వారికి చేయూతనిచ్చి వారి కోసం భవనాలు నిర్మించడం జరుగుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గంగపుత్రులు, ముదిరాజ్‌ ల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News