రామాలయంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్. సుభాష్ రెడ్డి ప్రత్యేక పూజలు

నగరంలోని సుభాష్ నగర్లో గల రామాలయాన్ని, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్. సుభాష్ రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు.

S. Srikanth
Published on: 24 Nov 2019 1:18 PM IST
రామాలయంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్. సుభాష్ రెడ్డి ప్రత్యేక పూజలు
X
R. Subash Reddy

నిజామాబాద్: నగరంలోని సుభాష్ నగర్లో గల రామాలయాన్ని, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్. సుభాష్ రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు.కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన న్యాయమూర్తికి ఆలయ అర్చకులు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

పూజల అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు జడ్జికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ విశాలిని రెడ్డి తో పాటు, ఆలయ కమిటీ సభ్యులు శంకర్ రెడ్డి, విఠల్ రెడ్డి అశోక్ రెడ్డి, నివేధిత, సుభాషిణి, రాధా, సబితా, అరుణ లక్ష్మీ, గోదాదేవి తదితరులు పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story